ఏంటి ప్రేమలు బ్యూటీ అన్నా అన్నా అంటూ అతనితోనే ప్రేమలో పడిపోయిందా.. ఇంతకీ ప్రేమలు బ్యూటీ మనసు దోచిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మలయాళం ప్రేమలు మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది నటి మమిత బైజు.. అయితే ఈ సినిమా కంటే ముందు మలయాళంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా మమిత బైజుకి స్టార్డం తీసుకొచ్చిన సినిమాగా ప్రేమలు మూవీ తన కెరీర్ లో నిలిచిపోయింది అని చెప్పవచ్చు.. ఇక ప్రేమలు మూవీ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ కి తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే ప్రేమలు మూవి తెలుగులో కూడా రిలీజ్ చేశారు.అలా తెలుగులో కూడా మమిత బైజుకి అభిమానులు పెరిగి పోయారు. 

అంతేకాదు ఈ హీరోయిన్ తమిళ హీరో విజయ్ దళపతి నటించిన జననాయగన్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. అలా ప్రేమలు మూవీ మమిత బైజు అదృష్టం మార్చేసింది అని చెప్పుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా మమితా బైజు ఓ హీరోతో కలిసి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.అయితే ఇదే ఫోటోని ఆ నటుడు కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మమిత బైజు పోస్ట్ చేసిన ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు నటుడు సంగీత్ ప్రతాప్. ప్రేమలు మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన సంగీత్ ప్రతాప్.. అయితే గత కొద్దిరోజుల నుండి మలయాళం ఇండస్ట్రీలో మమిత బైజు గురించి ఒక షాకింగ్ వార్త వైరల్ అవుతుంది.

అదేంటంటే మమితా బైజు సంగీత్ ప్రతాప్ తో ప్రేమలో ఉందని, ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ డేటింగ్ రూమర్లకు మరింత ఆజ్యం పోసేలా తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని నెట్టింట్లో షేర్ చేశారు.అయితే ఈ ఫోటో కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ అయినప్పటికీ ఇది చూసినా నెటిజన్లు మాత్రం షాకింగ్ రియాక్షన్లు ఇస్తున్నారు. అయితే మమిత బైజు షేర్ చేసిన పోస్టులో ఏముందంటే.. మమిత బైజు తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. ప్రొడక్షన్ 20 అనే పేరుతో కొత్త మూవీ పోస్టర్ ని అనౌన్స్ చేసింది.ఇందులో సంగీత్ ప్రతాప్ హీరోగా చేస్తున్నారు.

 అయితే ఇదే పోస్టర్ ని సంగీత్ ప్రతాప్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి లవ్ అనేది ఎప్పుడు మెనూలో లేదు. సడన్గా ఒకరినొకరు ఆర్డర్ చేసుకోనే వరకు వచ్చింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.అయితే ఈ పోస్టర్ కి ఈయన ఇచ్చిన క్యాప్షన్ సినిమాకి సంబంధించి అయినప్పటికీ చాలామంది నెటిజన్లు మాత్రం ఈ పోస్ట్ చూసి వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమే అంటూ కన్ఫర్మ్ చేస్తున్నారు.చాలా రోజుల నుండి సంగీత్ ప్రతాప్ మమిత బైజు మధ్య రిలేషన్ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయడంతో మరోసారి ఈ వార్తలు మలయాళంలో ఊపందుకున్నాయి. అయితే మమిత బైజు ప్రేమలు మూవీలో సంగీత్ ప్రతాప్ ని అన్నా అంటూ పిలుస్తుంది. కానీ అన్నా అన్నా అని పిలుస్తూ ఆ నటుడితోనే ప్రేమలో పడింది అంటూ ఈ విషయం తెలిసిన నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: