టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ సదా కూడా ఒకరు.. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించిన సదా ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి దూరమై వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారిపోయింది.. అయితే తాజాగా హీరోయిన్ సదా తన యూట్యూబ్ నుంచి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో 16 అడుగుల కింగ్ కోబ్రా పట్టుకోవడంలో భాగమైనట్లుగా తెలుస్తోంది వాటి గురించి పూర్తిగా చూద్దాం.



విశాఖపట్నం సమీపంలో ఉండే అరకు ప్రాంతంలో ఒక భవనంలో 16 అడుగుల కింగ్ కోబ్రా వెళ్లడంతో అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే వారు స్నేక్ క్యాచర్ రెస్క్యూ టిమ్ కి కాల్ చేసి సమాచారం అందించడంతో వెంటనే వారు అక్కడికి చేరి ఆ కోబ్రా ను పట్టుకున్నారు.. అయితే వీరితో పాటు టాలీవుడ్ హీరోయిన్ సదా కూడా ఈ ఆపరేషన్లు పాల్గొని తాచుపామును పట్టుకొని పోయి మరి అటవీ ప్రాంతంలో వదిలినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా చిన్న పాము కనిపిస్తే చాలు మనం భయపడిపోతాం అలాంటిది ఈ హీరోయిన్ మాత్రం చాలా ధైర్యంగా 16 అడుగుల ప్రాములను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు.


రెస్క్యూ ఆపరేషన్ తో కోబ్రాను పట్టుకొని క్షేమంగా తీసుకువెళ్లి మరి దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ వీడియో చూసిన పలువురు నేటిజన్స్  అభిమానులు ఈ టాలీవుడ్ హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకొని మరి ప్రశాంత్ ఇస్తున్నారు. సదా ప్రస్తుతం సినిమాలకు పలు రకాల టీవీ షోలకు దూరంగానే ఉన్నది.. నిత్యం అడవులలో తిరుగుతూ ఎన్నో రకాల జంతువులకు పక్షులకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తీస్తే అభిమానులతో పంచుకుంటూ ఉన్నది సదా. ఈ వీడియోకి సదా తెలియజేస్తూ ఎవరికైనా పాములు కనిపిస్తే.. వాటిని చెప్పడం తప్పు పాము లేకపోతే ఎకో సిస్టమ్ కూడా దెబ్బతింటుంది మీకు ఎక్కడైనా కనిపిస్తే భయపడకుండా ఇలాంటి రెస్క్యూ టీమ్ కి కాల్ చేయండి అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: