
రీసెంట్ గా హిట్ ఫోర్ సినిమాలో కార్తీ ఉండబోతున్నాడు అంటూ హిట్ 3 సినిమా ఎండింగ్లో హింట్ ఇచ్చేశాడు నాని . అయితే హిట్ ఫోర్ సినిమాలో నాని - కార్తీ కలిసి నటిస్తారా..? లేదా..? అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. కానీ అంతకంటే ముందే కార్తీ తో నాని నటించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. కార్తీ తన సినిమాల కథను ఎలా చూస్ చూసుకుంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కార్తి తన 29వ సినిమాను టెలాంటెడ్ డైరెక్టర్ తమిజ్ ఫిక్స్ అయిన విషయం అందరికీ తెలుసు .
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఇది నిర్మిస్తుంది . సముద్ర నేపథ్యంగా సాగే పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్స్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఇప్పటివరకు కార్తీ ని మనం ఎప్పుడు చూడని శక్తివంతమైన పాత్రలో చూడబోతున్నామంటూ చెబుతున్నారు . అంతేకాదు ఈ చిత్రంలో తెలుగు నటుడు నాని స్పెషల్ క్యారెక్టర్ లో మెరవబోతున్నారట . ఇటీవల నాని నటించిన హిట్ 3 సినిమాలో కార్తీ మెరిసిన విషయం అందరికీ తెలిసిందే . హిట్ ఫోర్ లోనూ కార్తీ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు . వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఈ క్రమంలోనే కార్తీ సినిమాలో నాని ని భాగం చేయాలని చిత్ర బృందం భావిస్తుందట . ఆల్రెడీ నానిని అప్రోచ్ అయ్యి కథ వినిపించగా ఓకే కూడా చేసేసారట. ఆల్మోస్ట్ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయినట్లే అంటున్నారు మేకర్స్. చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబో ఎలా సెట్ అవుతుందో..???