దుల్క‌ర్ స‌ల్మాన్.. ఈ మలయాళ స్టార్ హీరో గ‌త కొంత కాలం నుంచి టాలీవుడ్ లోనూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. `మహానటి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ మూవీతో దుల్క‌ర్ తెలుగు ఇండస్ట్రీలోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత `సీత రామమ్‌` సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రీసెంట్ గా `లక్కీ భాస్కర్` తో టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్నాడు. అటు మలయాళంలో పాటు ఇటు తెలుగులోనూ కొత్త ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం తెలుగులో దుల్కర్ రెండు చేస్తున్నాడు చేస్తున్నాడు.


అందులో ఒక చిత్రం `ఆకాశం లో ఒక తార` కాగా.. మ‌రొక‌టి `కాంత`. ఆకాశం లో ఒక తార సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వ‌హిస్తున్నారు. అలాగే కాంత విష‌యానికి వ‌స్తే.. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1950ల నాటి మద్రాసు నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాణ్ హీరో కాగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. రానా ద‌గ్గుబాటి ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఇప్పుడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.


అయితే ఇంత‌లోనే దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో మ‌రో కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల టాలీవుడ్ కు చెందిన ఓ బడా ప్రొడ్యూస‌ర్ సినిమా కోసం స‌రికొత్త స్టోరీతో దుల్క‌ర్‌ను అప్రోచ్ అయ్యార‌ట‌. ఇక తెలుగు ఆఫ‌ర్స్ కు ఈ మ‌ధ్య కాలంలో విప‌రీత‌మైన‌ ప్రాధాన్యత ఇస్తున్న దుల్క‌ర్‌.. స‌ద‌రు నిర్మాత తెచ్చిన‌ స్టోరీ గురించి తెలుసుకుని ఫిదా అయ్యార‌ట‌. సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ఇండ‌స్ట్రీలో వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ కొత్త ప్రాజెక్ట్ పై అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: