
తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో విలన్ గా కమెడియన్ గా తండ్రిగా ఎన్నో పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు. తాజాగా కోట శ్రీనివాసరావు అస్వస్థకు గురయ్యి ఈరోజు తెల్లవారుజామున మరణించారు. గడిచిన కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థత ఇబ్బంది పడుతూ ఉన్న కోట శ్రీనివాసరావు తన స్వగృహంలోనే మరణించారు. అయితే ఈయన వయసు 83 సంవత్సరాలు. బాల్యం నుండే కోట శ్రీనివాసరావుకు ఎక్కువగా నాటకాలు అంటే ఇష్టం ఉండేది. సినిమాలలోకి రాకముందు స్టేట్ బ్యాంకులో కూడా పనిచేశారట. 1968లో రుక్మిణి తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు. కుమారుడు పేరు కోటా ప్రసాద్. ఈయన 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మరణించారు.
సుమారుగా 750 కు పైగా చిత్రాలలో నటించిన కోట శ్రీనివాస్ మరణ వార్త విని ఎంతోమంది సినీ ప్రముఖులు దర్శక నిర్మాతలు, పలువురు రాజకీయ నాయకులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడు లో జన్మించారు. కోట శ్రీనివాసరావు తండ్రి సీతారామాంజనేయులు కూడా ఒక డాక్టర్. ఆయన కూడా తన తండ్రి లాగే డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకునే వారట. కానీ చదువుకునే రోజులలో మాత్రం ఎక్కువగా నాటకాల మీద మక్కువ ఉండటంతో అటువైపుగా వెళ్లారు.
తెలుగు ,తమిళ్ ,హిందీ కన్నడ మలయాళం అంటి భాషలలో కూడా నటించి పేరు సంపాదించిన కోటా శ్రీనివాసరావు ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాల్ రావు వంటి నటుల లోటును సైతం కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు. కానీ ఈరోజు ఉదయం అస్వస్థకు గురై కన్నుమూశారు కోటా శ్రీనివాసరావుకు ఆలీ నుంచి అమితాబ్దాకా అందరికీ కూడా ఇష్టమైన నటుడుగానే పేరు సంపాదించారు. కోట శ్రీనివాసరావు లేని వార్త విని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.