తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పంపిణీ హక్కులు హాట్‌కేక్‌ల్లా అమ్ముడవడంతో 350 కు పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఎమోషనల్ డ్రామాను నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించారు. నిమిషా సజయన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత సురేష్ కొండేటి... ఎస్‌కె పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి.. సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్‌తో సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. జూలై 18న 350 కు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.


మరోవైపు ఈ సినిమా పంపిణీ హక్కులు వివిధ ప్రాంతాల్లో హాట్‌కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. నైజాంలో గ్లోబల్ సినిమాస్-ఏషియన్ సునీల్, వైజాగ్‌లో గాయత్రిదేవి ఫిలిమ్స్- సతీష్, ఈస్ట్ గోదావరిలో ఆదిత్య సినిమాస్-హెచ్. నాగి సత్యనారాయణ, వెస్ట్ గోదావరిలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్-శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గురు రాఘవేంద్ర ఫిలిమ్స్-శోభన్, చిత్తూరు, కడప జిల్లాల్లో ధనలక్ష్మి ఫిలిమ్స్-డి. సుభాష్ చంద్ర నాయుడు హక్కులను సొంతం చేసుకున్నారు. వైబోధ ఘిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం... ఆధునిక సంబంధాలు, భావోద్వేగాలను చక్కగా చిత్రీకరించినట్లు సమీక్షకులు పేర్కొన్నారు. తమిళంలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం, తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకునే అవకాశం ఉందని నిర్మాత సురేష్ కొండేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రధానంగా యువతను ఆకర్షించే కథాంశంతో, సమాజంలోని సున్నితమైన అంశాలను చర్చించేలా రూపొందింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: