చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన స్టార్ హీరోలు ఎక్కువగా బుల్లి తెర కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో అనేక మంది సీనియర్ స్టార్ హీరోలు , యంగ్ స్టార్ హీరోలు కూడా అనేక టీవీ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు , బిగ్ బాస్ టెలివిజన్ షో లకు హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ 8 బుల్లి తెర సీజన్లను కంప్లీట్ చేసుకోక , ఒక ఓ టీ టీ సీజన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఇందులో నాగార్జున 6 బుల్లి తెర , ఒక ఓ టి టి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించాడు. మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర బిగ్ బాస్ 9 వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ 9 వ సీజన్లోకి ప్రముఖ డాన్సర్ అయినటువంటి జాను లైరి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమెకు మీరు బిగ్ బాస్ 9 వ సీజన్లోకి వెళుతున్నారా ..? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆమె లేదు అని సమాధానం ఇచ్చింది. గతంలో రెండు సార్లు కూడా నన్ను బిగ్ బాస్ లోకి రావాలి అని అడిగారు.

అప్పుడు కూడా నేను ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను అని ఈమె సమాధానం ఇచ్చింది.  ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే బారి మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారు కదా అయినా మీరు ఎందుకు వెళ్లడం లేదు అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది. దానికి ఈమె ... డబ్బుతో నన్ను ఎవరూ కొనలేరు అని సమాధానం చెప్పింది. ఇకపోతే బిగ్ బాస్ 9 వ సీజన్లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: