సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకం. సినిమా ఇండస్ట్రీ వారు అంటే ఏదైనా సాధించగలరు అని  నిరూపించిన గొప్ప వీరుడు.. అలాంటి ఎన్టీఆర్ తాను ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని కూడా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఇలాంటి ఎన్టీఆర్ గురించి కోట శ్రీనివాసరావు  సంచలన కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ తన చరిత్రను తానే  చెరిపేసుకున్నాడని కోట అన్నారు. అంతేకాదు  ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వచ్చినటువంటి మండలాధీశుడు చిత్రంలో కూడా కోట శ్రీనివాసరావు నటించాడు. అలాంటి ఈయన ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి  ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని మట్టుకరిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించారు.

 కానీ 60 సంవత్సరాల వయసులో తన చరిత్రను తానే చెరిపేసుకున్నారు.. ఎన్టీఆర్ భార్య బంగారు తల్లి.12 మంది పిల్లలను కని పెంచింది. అలాంటి మహా ఇల్లాలిని ఆయన మరచి  60 సంవత్సరాల వయసులో మరో మహిళ మెడలో తాళి కట్టాడు. ఆ విషయంలోనే నాకు రామారావు గారు అంటే కోపం వచ్చింది.. ఆ వయసులో ఆయనకు ఏం కావాలి శృంగారమా అంటూ  నేను కోప్పడ్డాను. ఒకవేళ ఆయనకంతగా తోడు కావాలి అనిపిస్తే వారి పిల్లలకు చెప్పి ఎవరినైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది.. ఇందులో ఎన్టీఆర్ పిల్లలు కూడా తప్పు చేశారు.. కనీసం వాళ్ళ నాన్న బాధను ఎవరు కూడా అర్థం చేసుకోకుండా ఎవరి బాధ్యతలు వారే చూసుకున్నారు.

 అయితే అప్పటికే పిల్లలందరికీ తలా నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని పంచారు ఎన్టీఆర్. కానీ ఎవరు కూడా తండ్రి బాధ్యతలు తీసుకోకపోవడంతో ఆయన రెండో పెళ్లి చేసుకోవడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. అంతటి మహానుభావుడు ఈ చిన్న విషయంలో తప్పుచేసి ఒక తప్పుడు మనిషిలా క్రియేట్ అయ్యాడు అది నాకు నచ్చలేదు. అందుకే ఎన్టీఆర్ ను  తప్పు చేశాడు అంటూ సంబోధించుకుంటూ వచ్చాను తప్ప వేరే విషయంలో కాదని కోట శ్రీనివాసరావు బ్రతికున్న కాలంలో తెలియజేశారు. అయితే ఆయన మరణం తర్వాత ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: