- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ‘ఖుషి’ మరియు ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు పరవాలేదనిపించే కలెక్షన్లను రాబట్టినా, విజయ్ అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. లైగ‌ర్ విజ‌య్ ప‌రువు తీసేసింది. ఇలాంటి సమయంలో విజయ్ తన తదుపరి సినిమా కింగ్డమ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని UA సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమా జూలై 31న విడుదల కాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కథ, కథనంలో కొత్తదనం ఉండబోతున్నట్లు యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలనే ధ్యేయంతో భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.


విజయ్ సరసన నటి భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్ పని చేయడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అనిరుధ్ అందించిన ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. విజయ్ మాస్ + క్లాస్ లుక్ లో కనిపిస్తున్న తీరు అభిమానుల్లో పెద్ద ఆసక్తిని రేపుతోంది. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన సత్యదేవ్ పాత్ర సినిమాకు ప్ల‌స్ అవుతుందంటున్నారు. కింగ్‌డ‌మ్ తెలుగు తో పాటు, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ మూవీ విడుదల కాబోతుండటంతో పాన్ ఇండియా రేంజ్‌లో హైప్ క్రియేట్ అవుతోంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే ప్రేక్షకులలో క్యూరియాసిటీ స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండకు ఇది ఎంతగా అవసరమైన హిట్‌అయితే, నిర్మాతలు, దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి కూడా హిట్ అవ‌స‌రం. మ‌రి వీరి ఆశ‌లు కింగ్‌డ‌మ్ ఎంత వ‌ర‌కు నెర‌వేరుస్తుందో ?  తెలియాలంటే ఈ నెల 31 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: