బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్  జంటగా నటించిన కిష్కింధపురి సినిమాకు సంబంధించి ఈ నెల 10వ తేదీన ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఒకటైన  AAA ముల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శితమైంది.   షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై కౌశిక్ పెగల్లపాటి  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.  ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చేరినట్టేనని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నప్పటికీ సినిమాపై ఉన్న నమ్మకంతో మేకర్స్ 10వ తేదీ, 11వ తేదీలలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.  హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా  కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ  ప్రేక్షకులలో ఆసక్తిని అంతకంతకూ  పెంచేశాడు.

ఎలాంటి అదనపు హంగులు లేకుండానే ఈ సినిమా తెరకెక్కింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఉన్న సెకండాఫ్ ఆహా అనేలా ఉంది. తమిళ నటుడు శాండ నటన ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనేలా ఉంది. నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ తో అనుపమ అదరగొట్టింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

థ్రిల్లర్ ఎపిసోడ్స్  స్టోరీ నేరేషన్ చాలా బాగుందని సినిమా చూసిన  ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్ సినిమాకు హైలెట్ అయింది. సౌండింగ్ తో మ్యాజిక్ చేయడంతో పాటు సినిమా రేంజ్ ను పెంచడంలో ఎం.ఆర్. రాజా కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా ఈ సినిమా ఉంది.  ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: