- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో చాలా యేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల‌లో వెంక‌టేష్ - త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ఒక‌టి. ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట వెంకటేష్ న‌టించిన న‌వ్వునాకు న‌చ్చావ్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు త్రివిక్ర‌మ్ క‌థ‌, మాట‌లు అందించారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా వీరిద్ద‌రి కాంబోలో సినిమా కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయినా ఇప్ప‌ట‌కీ వీరి కాంబినేష‌న్ సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. అయితే వాస్త‌వంగా త్రివిక్ర‌మ్ - బ‌న్నీ కాంబినేష‌న్ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది. పుష్ప 2 ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ హిట్ కావ‌డంతో ఇప్పుడు బ‌న్నీ .. త్రివిక్ర‌మ్ ను ప‌క్క‌న పెట్టేసి త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ సినిమాకు ఓకే చెప్పేశాడు. దీంతో ఇప్పుడు త్రివిక్ర‌మ్ గుంటూరు కారం సినిమా త‌ర్వాత యేడాదిన్న‌ర పాటు ఖాళీగా ఉంటూ వ‌చ్చారు.


ఎట్ట‌కేల‌కు త్రివిక్ర‌మ్ కు ఇప్పుడే ఏదో ఒక హీరోతో సినిమా సెట్ చేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక ఈ సినిమా ఎప్పుడు ?  సెట్స్ మీద‌కు వెళుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. 2026 స‌మ్మ‌ర్‌కు ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ ఏంటంటే త్రివిక్ర‌మ్ కంటే ముందు అనిల్ రావిపూడి సినిమాను వెంకీ పూర్తి చేయాల్సి ఉంద‌ట‌. అంటే చిరు సినిమా అనిల్ పినిష్ చేసేసి వెంట‌నే వెంక‌టేష్ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకువెళ‌తారు. ఆ త‌ర్వాత వెంకీ .. త్రివిక్ర‌మ్ సినిమా కు డేట్లు ఇస్తాడు. ఈ లెక్క‌న వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ కు అయినా ఈ సినిమా వ‌స్తుందా ? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: