లిటిల్ హార్ట్స్ హీరోయిన్ శివాని నగరం.. ప్రస్తుతం ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంది.సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివాని నగరం మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది.ఈ సినిమా తర్వాత వచ్చిన లిటిల్ హార్ట్స్  సినిమా కూడా ప్రస్తుతం యూత్ లో ఎంత క్రేజ్ సంపాదించిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు స్టార్ హీరోయిన్ అనుష్క ఘాటి, కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ మదరాసి ఈ రెండు పెద్ద సినిమాలతో విడుదలైన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ సినిమాలను దాటేసి అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా మంది అభిమానులు ఘాటీ,మదరాశి సినిమాలను పక్కనపెట్టి లిటిల్ హార్ట్స్ సినిమా చూడడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు.

అలా లిటిల్ హార్ట్స్ మూవీ యూత్ మనసు కొల్లగొట్టింది.అయితే అలాంటి ఈ సినిమాలో నటించిన శివాని నగరం తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ చెప్పింది. శివాని నగరం మాట్లాడుతూ.. నేను చదువుకుంటున్న సమయంలో మ్యాథ్స్ కోసం ట్యూషన్ కి వెళ్లేదాన్ని. అలా ట్యూషన్ కి వెళ్ళిన సమయంలో ఒక అబ్బాయి నాకు మ్యాథ్స్ చేయడంలో సహాయం చేసేవాడు. ఆయన మ్యాథ్స్ లో టాపర్ కూడా.. ఇక ఆయన నాకు హెల్ప్ చేయడంతో నేను ఇంప్రెస్ అయిపోయి అతనికి సిల్క్ చాక్లెట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాను. కానీ ఆ వ్యక్తి మాత్రం నేను ఇచ్చిన చాక్లెట్ తీసుకొని నా ప్రేమని రిజెక్ట్ చేసి నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు..

నేను ఒక చెల్లిలాగే భావిస్తున్నాను అంటూ షాకిచ్చాడు. ఇక వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ కి నేను షాక్ అయిపోయాను. ఆ తర్వాత ప్రేమ అనే ఆలోచన నా మైండ్ లోకి రాలేదు. ఇక చదువుకునే సమయంలో కొంతమంది నన్ను అక్కా అని పిలిచేవారు.అయితే ఇప్పుడు ప్రేమ గురించి నాకు ఎలాంటి ఆలోచన లేదు. కెరీర్ మీదే నా ఫోకస్ మొత్తం ఉంది. అలాగే నాకు కాబోయే వాడు నన్ను బాగా చూసుకొని,నేను చెప్పింది విని,వంట బాగా చేయాలి..ఈ క్వాలిటీస్ ఉంటే చాలు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అలా లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయని పాత్రతో యూత్ క్రష్ గా మారిపోయిన శివాని నగరం లవ్ స్టోరీ చెప్పడంతో చాలామంది నెటిజన్లు  ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: