ప్రవాస తెలుగు వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెన్షియల్‌ తెలుగు సొసైటీ (ఎన్‌ఆర్‌టీఎస్‌) పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్‌ఆర్‌టీఎస్‌ ఛైర్మన్‌ వేమూరి రవి ఇచ్చిన పిలుపు మేరకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కువైట్‌లో ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు వారి నుంచి భారీ స్పందన లభించింది. 


సుమారు 1,50,000 మందికిపైగా తెలుగువారు ఉన్న కువైట్‌లోని మాలియాలో దీనిని ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని తెలుగు వారంతా సభ్యత్వ నమోదుకు భారీగా తరలివచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఏపీ ఎన్నార్టీఎస్‌ చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ బుచ్చి రాంప్రసాద్‌, పెట్టుబడుల విభాగం డైరెక్టర్‌ శేషబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములకాల సుబ్బారాయుడు, బలరాం నాయుడు, వెంకట శివరావు కోడూరి, సాయి సుబ్బారావు, అక్కిలి నాగేంద్రబాబు, దివాకర్‌ నాయుడు ఓలేటి, వెంకటేశ్వర్లు యేగి, రమణ పేరం, సురేశ్‌ బాబు మేలపాటి, స్కైనెట్‌ ప్రసాద్‌, ఉదయ్‌ అడుసుపల్లి, బాబు పోలారపు, మల్లికార్జున మారోతు, ఎజ్దానీ భాషా తదితరులు సభ్యత్వ నమోదు విజయవంతం అయ్యేందుకు సహకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: