హైదరాబాద్: సినిమా థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లు ఇలా అనేక ప్రదేశాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లను వసూలు చేస్తూ ఉంటారు. సహజంగా ప్రజలు కూడా ఈ రేట్లకు అలవాటు పడిపోయారనే చెప్పాలి. ఈ ప్రదేశాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్మినా కానీ వినియోగ దారులు పెద్దగా ప్రశ్నించారు. కానీ.. అందరూ అలానే ఉంటారని అనుకోవడం పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి వాటర్ బాటిల్‌పై రెస్టారెంట్ యాజమాన్యం రూ. 10 అదనంగా వసూలు చేసినందుకు రెస్టారెంట్ అంతు చూసే వరకు నిద్రపోలేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019 జూలై నెల 13వ తేదీన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మోసిన అనే వ్యక్తి పంజాగుట్ట క్రాస్ రోడ్‌లో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. లంచ్ చేశాక బిల్లులో వాటర్ బాటిల్ రేటు రూ. 30 అని ఉండటంతో.. రెస్టారెంట్ వారిని నిలదీశాడు. అయితే రెస్టారెంట్ సిబ్బంది మాత్రం అదేం తమకు తెలియదు అని రూ. 30 చెల్లించాల్సిందే అని పట్టుబట్టింది. దీంతో మోసిన్‌ ఆగ్రహం చెంది.. రెస్టారెంట్ విషయాన్ని కన్జూమర్ ఫోరానికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఎమ్మార్పీ కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన నష్టానికి రెస్టారెంట్ రూ. 2.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, అంతేకాకుండా కోర్టు ఖర్చుల కింద రూ. 55 వేలు చెల్లించాలని కోరాడు.

చివరకు రెస్టారెంట్ యాజమాన్యానికి కన్జూమర్ ఫోరమ్ షాకిచ్చింది. వాటర్ బాటిల్‌పై అదనంగా వసూలు చేసిన రూ. 10కి 12 శాతం వడ్డీ ఎన్ని నెలలు గడిచిందో అన్ని నెలలకు చెల్లించాలని ఆదేశించింది. బాధితుడిని మానసికంగా వేధించినందుకు రూ. 20 చెల్లించాలని చెప్పింది. అదే విధంగా అతడి కోర్టు ఖర్చులకు మరో రూ. 5 వేలు చెల్లించాలని పేర్కొంది. అది కూడా 45 రోజుల్లోగా చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఈ విధంగా బాధితుడు రెస్టారెంట్‌కు గట్టి షాకిచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: