
మరికొన్ని రోజుల్లో పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక రాజకీయాలు ఎంతో హాట్ హాట్ గా మారిపోయాయి.. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఈసారి అధికారాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు కూడా ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రజలను ఆకర్షించేందుకు పావులు కదుపుతూ వుండటం గమనార్హం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇటీవల పంజాబ్ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వరుసగా ప్రచారం నిర్వహిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్.
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాము అంటూ అమాద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అంతేకాదు సరిహద్దులో అమరులైన సైనికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందజేస్తామని తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భార్య మెచ్చుకున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమను గెలిపిస్తే పంజాబ్ రాష్ట్రంలో కూడా అలాంటి స్కూల్లనే నిర్మిస్తాము అంటూ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇవ్వడం గమనార్హం.