ప్రతి మనిషికి విశ్వాసం అనేది అదనపు బలాన్ని ఇస్తే. నమ్మకం అనేదిమరింత శక్తినిస్తుంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, పరిస్థితుల్ని పట్టించుకోకుండా ఈ విశ్వాసం.. నమ్మకం.. పరిధులు దాటితే అనర్థమే ఎదురవుతుంది అనే సత్యం నిరూపించబడింది.. అదెలా అంటే.. విదేశాల్లో కరోనా ప్రజలను వేటాడుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వాలు చేసిన హెచ్చరికలు ప్రజలు పట్టించుకోక.. మాకేం అవుతుందిలే అనే నమ్మకంతో సర్వ నాశనం అయ్యారు.. ఇక అక్కడి కధను వదిలేస్తే ప్రస్తుతం మనదేశంలో కరోనా విజృంభణ వెనుక ఉన్నది కూడా విశ్వాసం చాటున దాగిన నిర్లక్ష్యమే. అదే ఓ మత సమావేశం..

 

 

ఇది ఎవరూ ఊహించని విధంగా దేశంలో పిల్ల కాలువలా ఉన్న కరోనాను మహా నదిలా మార్చింది.. ఇదంతా ఎందుకు చేస్తున్నామో.. ఎలా చేస్తున్నామో తెలియనంత మూఢ విశ్వాసాల దారుల్లోకి జనం వెళ్లిపోతున్నారు. బతుకు… బతికించు అనే సర్వమత సారాన్ని మర్చిపోయారు.. ఇకపోతే ఇప్పటి వరకూ మానవ జాతి చూడనటువంటి మహా విపత్తు కరోనా వైరస్... ఈ సమయంలో ప్రతి వారు స్వచ్చమైన ఆలోచన కలిగి.. వివేకంతో వ్యవహారించడం కన్నా ఉత్తమమైన మార్గం లేదు.. దీన్ని బాధ్యతగా స్వీకరించాలి.. అదీగాక మనిషిలోని నిజాయితీకి ప్రకృతి పెట్టిన పరీక్ష. కానీ ఇందులో మనిషి విఫలం అయ్యాడు, అవుతున్నాడు..

 

 

ఎందుకంటే కంటికి కనిపించని ఒక వైరస్‌తో యుద్ధం చేయడానికి కావలసింది ఓపిక.. ఇందుకు గాను మీరంతా ఓపికగా ఇంటిలో ఉండమని చెబితే.. సర్వ మతాల సారం ఒక్కటే. అదే మానవత్వం. అనే విషయాన్ని గ్రహించక.. విశ్వాసాల పేరుతో.. పీకల మీదకు తెచ్చుకుంటోంది మానవాళి. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాతే ఘటనే దీనికి నిదర్శనం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పోలీసులకు తెలియకుండా నిర్వహిస్తున్న వారు తామేదో గొప్ప పని చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వారు చేస్తున్నది.. సమాజానికి హాని. తాము దేని కోసం సమావేశం నిర్వహిస్తున్నారో.. సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నారో వారికే తెలియాలి..

 

 

ప్రపంచం అంతా… ఏ పని చేయవద్దని చెబుతుందో అదే చేసారు.. చేస్తున్నారు. అలా చేయడం వల్ల కలిగే దుష్పరిణాలు మనుషులు భరించడం సాధ్యమా.. ఇక ప్రపంచం మొత్తం లాక్ డౌన్ పేరుతో.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూంటే.. అర్థం పర్థం లేని విశ్వాసాలు.. మూఢ నమ్మకాలతో.. ఆ ప్రపంచం కృషిని వీరు నిర్వీర్యం చేస్తున్నారు... దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే మతం కంటే మానవత్వం చాలా గొప్పది.. ఒక మనిషి మరణిస్తున్న పదిమందిని ఆ చావు బ్రతికించాలి.. కానీ ఇక్కడ విరుద్దంగా జరిగింది.. మానవత్వం లేదని నిరూపించబడింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: