తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఆయన అన్ని విధాలుగా కూడా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయనకు ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందలేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయన కోసం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ఒక్కసారి చూస్తే త్వరలోనే బిజెపి అధిష్టానం తెలంగాణకు ఒక కమిటీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ కమిటీలో కొంతమంది కీలక నేతలను పెట్టి ఎవరైతే పార్టీ కోసం పని చేయడం  లేదో వారందరినీ కూడా పార్టీ నుంచి పంపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ తో పాటుగా ఇతర పార్టీలతో స్నేహం చేసే నేతలను కూడా ఇప్పుడు చాలా వరకు కూడా పక్కన పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎవరైతే మాట వినకుండా వ్యవహరిస్తున్నారో పార్టీ అధిష్టానం నిర్ణయాలను కూడా కనీసం పట్టించుకోవడం లేదో వారందరి మీద కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే కొంతమంది నేతలను బయటకు పంపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఎవరిని పంపిస్తారు ఏంటి అనేది చూడాలి. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఆశించిన స్థాయిలో బీజేపీ నేతలు పని చేయలేదు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్కన బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కష్టపడుతున్న సరే మిగిలిన నేతలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు అని దీనితో టిఆర్ఎస్ పార్టీ ఏదైనా మాట్లాడగలుగుతుంది అని పలువురు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: