రాజకీయాలు అంటే ఎన్నో రంగులు. అసలు సృష్టిలో ఉన్న రంగులు ఏవీ కూడా అక్కడ సరిపోవు. ఎప్పటికపుడు రంగు మార్చుకున్నదే రాజకీయం అని అంటారు. రాజకీయాల్లో వన్నె చిన్నెల గురించి వర్ణించతగునా అన్న సందేహాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తారు.

ఇవన్నీ ఎందుకంటే ఇపుడున్న రాజకీయ పార్టీలు సిద్ధాంతానలు పక్కన పెట్టి కేవలం రాద్ధాంతాలకే ప్రాధ్యాన్యత ఇస్తున్నారా అన్న డౌట్లు కూడా చాలా మందికి వస్తూంటాయి. తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ గాలి వాటు రాజకీయాలు చేస్తుందని ప్రత్యర్ధులు అంటారు. కానీ తమ నేత అపర చాణక్యుడు అని తమ్ముళ్ళు మురిసిపోతారు.

ఇక బీజేపీ తీరు చూస్తే ఆ పార్టీ కన్నా లక్ష్మీ నారాయణ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు కధ  వేరుగా ఉండేది. ఆ తరువాత తీరు మారిపోయింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కన్నా అయితే టీడీపీకి అనుకూలంగా ఉండేవారు అని చెప్పుకునేవారు. ఇపుడు సోము వీర్రాజు వచ్చాక ఆయన చంద్రబాబుని టీడీపీని గట్టిగానే తగులుకుంటున్నారు. ఏపీలో జగన్ సీఎం గా ఉన్నా కూడా ఆయన బాణాలు ఎపుడూ బాబు మీదనే దూసుకువస్తాయని కూడా చెబుతారు.

తాజాగా జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా సోము వీర్రాజు జగన్ మీద తక్కువగా బాబు మీద ఎక్కువగా విమర్శలు చేశారని అంటున్నారు. అయితే సోముకు బాబు అంటే మొదటి నుంచి వ్యతిరేకత ఉందని, ఆయన కనుక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉంటే టీడీపీతో జత కట్టడం కష్టమని కూడా పసుపు పార్టీలో చర్చ సాగుతోంది.

మరో వైపు బీజేపీ జాతీయ నాయకులు అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జగన్ సర్కార్ మీద గట్టిగానే విమర్శలు చేశారు. మరి కేంద్ర నాయకుల స్టాండ్ మారిందా లేక వారు ఏమైనా ఏపీలో కొత్త దోస్తీల కోసం చూస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బీజేపీలో కూడా టీడీపీ వైపు చూసేవారున్నారు. వైసీపీని పల్లెత్తు మాట అనలేని వారు ఉన్నారు. ఇక జనసేనతో కలసి ఉండేవారు ఉన్నారు. విడిగా రాజకీయం చేసేవారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూంటే ఒక్క కమలంలో ఇన్నేసి కలరింగులా అనిపించక మానదుగా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: