ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలు అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలి అనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరికీ సేవలు అందించడంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేసింది అని చెప్పాలి. అయితే గ్రామ సచివాలయ వ్యవస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సమయపాలన పాటించడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి.



 ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును సచివాలయ వ్యవస్థ లోని వాలంటీర్ల  వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించేందుకు నివేదికను తప్పించుకుంది రాష్ట్రప్రభుత్వం.ఈ క్రమంలోనే ఇక ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఉద్యోగులందరికీ సమయపాలన పాటించే విధంగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఒకప్పటిలా రిజిస్టర్లో సంతకం కాకుండా కొత్త విధానానికి తెర మీదికి తెచ్చింది జగన్ ప్రభుత్వం. రేపటి నుంచి ఇక అన్ని సచివాలయాల్లో కూడా బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.



 గ్రామ వార్డు సచివాలయం లో పనిచేసే ఉద్యోగులు వాలంటీర్లు అందరూ కూడా ఇక ఆఫీస్ కు వచ్చిన సమయంలో ఇక ఆఫీసులో విధులు ముగించుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయాలి అంటూ ఇటీవల జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగం చేస్తున్న వారందరూ సచివాలయం పరిధిలోనే నివసించే ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగికి పూర్తి చిరునామా సహా అన్ని రకాల వివరాలు కూడా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి అని నిర్ణయించింది. ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సూచించింది ప్రభుత్వం. విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: