సాధారణంగా రాజకీయ నాయకులు అన్న తర్వాత ఎప్పుడూ అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల పై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వివిధ సమావేశాలలో చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్న వారు ఆచితూచి మాట్లాడక పోతే చివరికి విమర్శల పాలవుతుంటారు. ఈ క్రమంలోనే ఏ సమావేశానికి వెళ్ళినా అందరూ ఆచితూచి మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ కొంతమంది మాత్రం కొన్ని సందర్భాల్లో నోరుజారి చివరికి తీవ్ర విమర్శల పాలవుతు ఉంటారు. ఇలా ఏకంగా ఎమ్మెల్యే, మంత్రి లాంటి ప్రజా ప్రతినిధి హోదాలో కొనసాగుతున్నారు చిత్రమైన వ్యాఖ్యలు చేశారు అంటే చాలు ఇక అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అటు ప్రత్యర్థి పార్టీలు కూడా ఇదే విషయాన్ని  టార్గెట్ గా చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యేకు ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురవుతుంది. సాధారణంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి రోడ్ల గురించి మాట్లాడాలి అంటే.. ప్రభుత్వం రోడ్డును బాగు చేయించిందని.. ఇప్పుడు రోడ్లు సుందరంగా మారిపోయాయి అంటూ చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం చిత్రంగా వ్యాఖ్యలు చేశారు. రోడ్ లను కత్రినాకైఫ్ బుగ్గలతో పోల్చాడు.. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. రాజస్థాన్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్  చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా బాగు చేయించాలని..  అన్ని రోడ్లు కూడా హీరోయిన్ కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కాస్త తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం ఉదయపూర్వతి లో ఇటీవల ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఒక సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో రోడ్లు బాగు చేయించాలి అంటూ ప్రజలు కోరారు. ఇక నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయించాలని ఏకంగా కత్రిన కైఫ్ బుగ్గల్లా  ఉండాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇటీవలే రాజేంద్రసింగ్ ఏకంగా మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: