ఆంద్రప్రదేశ్ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పనవరం లేదు. ఇతను రాజకీయనాయకుడిగా ఉన్నప్పటికీ లోకల్ గానే పేరును సంపాదించుకున్నాడు. కానీ 2008 సంవత్సరంలో ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్ మరియు యజమాని రామోజీరావు ను అతని అవినీతని ప్రశ్నించడం ద్వారా ఉండవల్లి వెలుగులోకి వచ్చాడు. ఉండవల్లికి రాజకీయాలపైన అపారమైన అనుభవం మరియు పరిణితి ఉంది. అప్పట్లో శోణిగాంధీ మరియు రాహుల్ గాంధీలకు పార్లమెంట్ లో అనువాదకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయారు.

అప్పటి నుండి రాజకీయాలను ప్రజలకు అర్ధమయ్యే విధంగా మీడియా సమావేశాల ద్వారా చెబుతూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఏమీ జరగలేదని రాష్ట్రానికి కీలకం అయిన పోలవరం ప్రాజెక్ట్ , రాజధాని నిర్మాణం వంటి పలు కారణాలలో చంద్రబాబును పదే పదే విమర్శించారు. ఆ తర్వాత చంద్రబాబు పాలన అంతమైపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఆవిర్భావం నుండి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్ కు మద్దతుగానే ఉంటూ వచ్చారు.

అయితే జగన్ 2019 లో అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి ఉండవల్లి జగన్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడినని.. వాళ్ళ తండ్రి లాగా వ్యవహరించే మనసు కలవాడు కాదని మీడియా ముఖంగా చెప్పాడు. ఇక తాజాగా ఉండవల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నదని క్లియర్ గా చెప్పారు. ఎందుకు జగన్ పోలవరం నిర్మాణం, రాష్ట్ర విభజన కింద రావాల్సిన లాభాలు, వంటి విషయాలను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ విమర్శించారు. రాష్ట్రము ఆ రోజు విడిపోవడానికి కారణం బీజేపీ అని కుండబద్దలు కొట్టారు.

పార్లమెంట్ లో వారి మద్దతు లేకుండా ఉంటే బిల్లు పాస్ అయ్యేది కాదని ఉండవల్లి చెప్పారు. మరి ఈ విషయం అడగడానికి జగన్ కు ఎందుకు భయం అంటూ విమర్శించడంతో అందరూ అవాక్కయ్యారు. విలేఖరులు సైతం మీరేంటి జగన్ కు సపోర్ట్ గా ఉండకుండా ఇలా మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు... ఏపీలో నా సపోర్ట్ టీడీపీ కి ఉండదు వైసీపీకి ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: