
ఈ రహదారి ఏర్పాటు వల్ల హైదరాబాద్ - వైజాగ్ మధ్య 4 గంటల ప్రయాణం ఆదా కావడంతో పాటు సుమారుగా 125 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వారు విజయవాడ వెళ్లకుండానే రాజమండ్రి దాటాక దేవరపల్లి నుంచి నేరుగా ఖమ్మం మీదుగా సూర్యాపేట వెళ్లిపోతారు. మరీ ముఖ్యంగా ఈ రూట్లో ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించే 162 కిలోమీటర్ల రహదారి పచ్చని పంట పొలాల మధ్యలో వెళుతూ అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక ఈ నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ జాతీయ రహదారి 162 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 చోట్ల మాత్రమే దీనిపై ప్రవేశించడానికి వీలుంది. తెలంగాణాలోని ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి ఏపీలో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద మాత్రమే ఈ రహదారిపైకి రావడానికి అనుసంధాన రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ పరిధిలో నాలుగు చోట్ల టోల్ ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలో భూ సేకరణ అంశం కొలిక్కి వస్తే అక్కడ కూడా నిర్మాణం చేపట్టి రహదారిని ఆగస్టు 15 నాటికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు