
విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేరుగా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన 64 డివిజన్ నుంచి జనసేన తరఫున కార్పొరేటర్ గా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ డిప్యూటీ ఎన్నిక సోమవారం కోరం లేక వాయిదా పడింది. ఈ పదవి విషయమై టిడిపి కార్పొరేటర్లు తమకే కావాలని పట్టుపట్టారు. అయితే నాటకీయకంగా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన కార్పొరేటర్ గోవింద్ రెడ్డి పేరును సీఎం చంద్రబాబు సీల్డ్ కవర్లో పంపారు. అయితే టిడిపి కార్పోరేటర్లు ఖాతరు చేయలేదు. చంద్రబాబు నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ టీడీపీ కార్పొరేటర్లు అందరూ ... ఒక హోటల్లో సమావేశం అయ్యారు. యాదవ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ ను డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవాలని పట్టుబట్టారు.
డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 56 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం కాగా నిన్న 54 మంది మాత్రమే హాజరయ్యారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్లను బుజ్జగించి .. ఒప్పించి మరీ డిప్యూటీ మేయర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశారు. ఇలా టిడిపి కార్పోరేటర్లకు ఇష్టం లేకుండా జనసేన కార్పోరేటర్ గోవింద్ రెడ్డిని చివరికి అయిష్టంగా .. అసంతృప్తి మధ్య ఎన్నుకున్నారు. ఏదేమైనా కూటమి లో కుమ్ములాటలు .. అసంతృప్తులు . . బుజ్జగింపులు అయితే రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు