ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిడిపి మహానాడు కొనసాగుతున్న నేపథ్యంలో... జూనియర్ ఎన్టీఆర్కు కీలక పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ ను ఫైనల్ చేయాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది.


కూటమి ప్రభుత్వ పథకాలకు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అనే దాని పైన చర్చ జరుగుతుందట. జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి  దూరంగా పెట్టి చంద్రబాబు కుటుంబం కుట్రలు చేస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు  వస్తున్నాయి. అదే సమయంలో... వైసిపి పార్టీ కూడా  ఇదే అంశాన్ని పదే పదే చెబుతోంది.   అయితే ఆరోపణలను దూరం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

 భవిష్యత్తు కాలంలో తారక అవసరం టిడిపి పార్టీకి అవసరం ఉందని కూడా అంచనా వేస్తున్నారట. అయితే పార్టీ బాధ్యతలు కాకుండా ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగిస్తే... ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందని చెబుతున్నారు. దీనికోసం టిడిపి అగ్ర నేతలు అందరూ జూనియర్ ఎన్టీఆర్ను కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ... చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రపోజల్ ను.. జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా లేదా అనేది కూడా  చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: