జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో  సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే.  ఈ  ఘటనకు సంబంధించి జగన్ పై కేసు నమోదు కాగా జగన్ క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ ను నేడు  విచారిస్తూ  హైకోర్టు  చేసింది.  కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై  కేసు ఎలా పెడతారంటూ  హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.  ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు  ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

 జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో సింగయ్య  అనే వైసీపీ కార్యకర్త మృతి చెందారు.  అయితే  నల్లపాడు పోలీసులు జగన్  కాన్వాయ్ వల్లే సింగయ్య మృతి చెందాడని  కేసు నమోదు చేయడంతో పాటు  నిందితుల జాబితాలో జగన్ పేరు చేర్చారు.  అయితే జగన్ పై రాజకీయ  ప్రతీకారంతోనే  కేసు నమోదు చేశారని  జగన్ ప్రజల్ని  అడ్డుకోవడానికే  ఈ ప్రయత్నమని వైసీపీ అభిమానులు  భావిస్తున్నారు.

ఈ పిటిషన్ తో పాటు  వైసీపీ నేతలు దాఖలు చేసిన  మరో నాలుగు పిటిషన్లను సైతం కలిపి కోర్టు విచారణ చేసింది.  ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారని  అన్ని జాగ్రత్తలు తీసుకున్నా  కుంభమేళాలో  తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు  పేర్కొంది.  వాదనలు వినిపించడానికి ప్రభుత్వ లాయర్ మరి కొంత సమయం కోరిన నేపథ్యంలో  జులై నెల 1వ తేదీకి  విచారణ వాయిదా పడింది.

 మరోవైపు జగన్  బులెట్ ప్రూఫ్ కారును  ఆర్దీవో అధికారులు తనిఖీ చేశారు.  ఏపీ 40 డీహెచ్ 2349 రిజిస్ట్రేషన్ నంబరు  ఉన్న ఈ కారును జిల్లా  పోలీస్ కార్యాలయంలో ఉంచారని తెలుస్తోంది.  జగన్ తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని  తనపై నమోదైన కేసు విషయంలో  పోలీసుల వాదన  నెమ్మెదిగా లేదని జగన్  పేర్కొన్నారు.  తన పర్యటన వివరాలను పోలీసులకు అందజేసినా  తగిన భద్రతా కల్పించలేదని  జగన్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: