- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఘనమైన నినాదం తెలుగు వాడి సొంతం. ఎంతో ఘనమైన సంస్థగా పేరు తెచ్చుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తారు అని ఇప్పటిదాకా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాలుగున్నర సంవ‌త్స‌రాలుగా దీక్షలు చేపడుతున్నాయి. అలాగే నిరసనలు .. ఆందోళనలు .. ఇతర కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా విశాఖ ప్లాంట్ ని ప్రైవేటుపరం కాదు అని చెప్పాలని డిమాండ్ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతుందని తరచూ వార్తలు వస్తున్న ఇప్పుడు కొత్త ట్విస్టు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.


పార్టులు పార్టులు గా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ని పార్టులు పార్టులుగా ప్రవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తుందని ఉక్కు ప్రైవేటు కర‌ణ‌ పోరాట కమిటీ చైర్మన్ నర్సింగరావు ఆరోపించారు. ఇందుకు ఆయ‌న చాలా ఉదాహరణలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ లో ముఖ్యమైన రా మెటీరియల్ హ్యాండ్లింగ్ .. ప్లాంట్ మెయింటినెన్స్ వంటి విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధం చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విభాగాలను ప్రైవేటుపరం చేయటం కోసం టెండర్లను కూడా పిలిచారని ఆయన తెలిపారు. ఇలా ముఖ్య విభాగాలను ప్రైవేటుపరం చేస్తే ఏదో నాటికి ప్లాంటు సైతం ప్రైవేటుపరం అవుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: