ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేయనున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. మోడీకి ప్రత్యామ్నాయ నేతను వెతికే పనిలో ఆర్.ఎస్.ఎస్ బిజీగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. RSS చీఫ్ మోహన్ భగవత్ తాజాగా మాట్లాడుతూ రాజకీయ నాయకులు 75 సంవత్సరాల వయస్సుకు రిటైర్మెంట్ తీసుకోవాలంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతున్నాయి.

RSS   నేతలు తమ కామెంట్ల ద్వారా మోదీకి  పరోక్షంగా సూచనలు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.  బీజేపీ పార్టీలో అనధికారికంగా  ఈ నియమం అమలవుతోంది.  మోడీ  తోలి కేబినెట్ లో కొంతమంది నేతలు ఈ కారణం వల్ల   రాజీనామా చేయడం జరిగింది.  అమిత్ షా గతంలో ఈ 75 సంవత్సరాల  వయస్సు నియమాన్ని  చర్చలోకి తీసుకొచ్చారని  కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

మరో రెండు నెలల్లో మోడీ  వయస్సు 75 సంవత్సరాలు క్రాస్ చేయనున్న నేపథ్యంలో  ఈ రూల్ మోడీకి మాత్రం వర్తించాడంటూ  ఇప్పటికే బీజేపీ నేతలు  క్లారిటీ ఇవ్వడం జరిగింది.  2029 వరకు మోదీనే  ప్రధానిగా ఉంటారంటూ   పలువురు  బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది.  మోహన్ భగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో  ఎలాంటి మలుపులు చోటు  చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

అయితే కాంగ్రెస్ నేతలు  మాత్రం ఈ విషయంలో మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండటం  చర్చనీయాంశం అయింది.   మోడీ రిటైర్ అయితే  ఆ ప్రభావం బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో  పడే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి  బీజేపీ పడిన  కష్టం అంతాఇంతా కాదు.  అందువల్ల  బీజేపీ  ఈ నియమం విషయంలో మార్పులు చేస్తే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: