ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి సర్కార్ ఎన్నికల ముందు గొప్పలకు పోయి హామీలు ఇచ్చినా ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. భారీ స్థాయిలో కూటమి సర్కార్ అమలు చేసిన పథకం తల్లికి వందనం మాత్రమేననే సంగతి తెలిసిందే.

మహిళలకు 1500 రూపాయల పథకం గురించి తాజాగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చేసిన కామెంట్లు ఒకింత  వివాదాస్పదం అయ్యాయి.  వైఎస్సార్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ పథకాలను గత సర్కార్ అమలు చేసింది.  అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఈ పథకాల గురించి ప్రస్తావించడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికే రాష్ట్రం అప్పులు అంతకంతకూ  పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహిళలకు 1500 ఇవ్వాలంటే ఏపీని అమ్మేయాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  నెలకు 1500 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం అమలు చేస్తామని కూటమి నేతలు చెప్పగా అందుకు భిన్నంగా  జరిగింది. 50 ఏళ్లకే  పెన్షన్, నిరుద్యోగ భృతి లాంటి పథకాలను సైతం అమలు చేయాల్సి ఉంది. కూటమి  సర్కార్ హామీలు అమలు చేయకపోతే  ప్రజల స్పందన  ఏ విధంగా ఉండనుందో  చూడాల్సి ఉంది.

వైసీపీ మాత్రం ఏ మాత్రం అవకాశం ఉన్నా కూటమి సర్కార్ పై  ఊహించని స్థాయిలో విమర్శలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కూటమి పాలనపై ప్రజల్లో ప్రస్తుతం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి.  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందే  విధంగా ఏపీ సర్కార్ అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని  కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: