దాదాపు 20 సంవత్సరాల క్రిందట రిలీజైన సినిమా ఒకే ఒక్కడు. ఆ సినిమాలో హీరో అర్జున్ కొన్ని కారణాల వలన ఒక్కరోజు సీఎంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు. తరువాత సీఎం పదవితో ప్రజలకు మేలు చేకూరేలా చేస్తాడు. గత సంవత్సరం విడుదలైన భరత్ అనే నేను సినిమాలో కూడా మహేశ్ బాబు సీఎంగా నటించాడు. సినిమాలో ప్రజలకు మంచి జరిగేలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఆ సినిమాలన్నీ కల్పితాలు. అలా నిజంగా జరిగితే బాగుంటుందనేలా ప్రజలకు అనిపించేలా చేసిన సినిమాలు. 
 
కానీ ప్రస్తుత సీఎంజగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే ఆ సినిమాలోని కల్పిత జీవితాన్ని నిజ జీవితంలో ప్రజలు అనుభవించేలా పరిపాలిస్తున్నారు సీఎం జగన్ గారు. కొత్త కొత్త పథకాలతో రోజుకో సంచన నిర్ణయం తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేకూరేలా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అమ్మఒడి, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం, డ్వాక్రా రుణమాఫీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ఇలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
సీఎంగా పదవి చేపట్టిన నెల రోజుల్లోనే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసేలా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన జరుగుతోంది. అవినీతి రహిత పాలన అందించటానికి ప్రస్తుత ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. 151 సీట్లతో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు తన పాలనతో జగన్మోహన్ రెడ్దిగారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో తీసుకెళ్ళటానికి ఎంతగానో శ్రమిస్తున్నారు సీఎం జగన్ గారు. నెల రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత అభివృధ్ధి చేసిన జగన్ ఐదేళ్ళలో మరింతగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృధ్ధి చేయటం మాత్రం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: