
ఇక కొంత మంది జట్టులో ఎవరి ఉంటే బాగుంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే ఆసియా కప్ ముందువరకు ఎంతో పటిష్టంగా కనిపించిన టీమిండియా ఇటీవలే ఆసియా కప్ లో మాత్రం పేలవమైన ప్రదర్శన చేసింది అనే విషయం తెలిసిందే. దీంతో టి20 వరల్డ్ కప్ లో ఎవరు తుది జట్టులో ఉంటే బాగుంటుంది అనే దానిపై ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16 లోపు టి20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఎవరు అయితే ఉంటే బాగుంటుంది అనే విషయంపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా స్పందించాడు.
టి20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేశాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఆశిష్ నెహ్రా ఎంపిక చేసిన కొంతమంది ఆటగాళ్ళ విషయంలో మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా తోపాటు రవీంద్ర జడేజాను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అతనికి ఇటీవలే మోకాలి శస్త్ర చికిత్స కారణంగా జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ ను కాకుండా ఇంకా గాయం నుంచి కోలుకోని రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకోవడం కాస్త విచిత్రంగా అనిపించింది అని చెప్పాలి.
నెహ్రా టి20 ప్రపంచకప్ జట్టు : రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, బుమ్రా, చహల్, అర్ష్ దీప్ సింగ్.