కరోనా వైరస్ ప్రభావం కారణం గా ఐపీఎల్ టోర్ని నిర్వహించడం విషయం లో గతంలో బీసీసీఐ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభం ముగింపు సమయంలో బీసీసీఐ అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకలను కూడా నిర్వహించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించింది. ఎంతో మంది సెలబ్రిటీలు ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో సందడి చేశారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ నెల 28వ తేదీన జరగబోయే ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని భావిస్తుంది.


 ఈ క్రమంలోనే ఇక ముగింపు వేడుకల కోసం ఖర్చు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే సెలబ్రిటీలతో  సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు. ప్రముఖ రాపర్ కింగ్, డీజే న్యూక్లియ, సింగర్లు డివైన్, జ్యూనిత గాంధీ లు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారట. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయ్ అని చెప్పాలి. ఇక ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. ఇకపోతే ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా ఉంది. అంతేకాదు నాలుగు సార్లు టైటిల్ విజేతగా కూడా కొనసాగుతుంది. మరోవైపు గుజరాత్ జట్టు గత ఏడాది ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.  వరుసగా రెండోసారి ఫైనల్ అడుగుపెట్టింది. ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl