త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు సతీమణి భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దేవి, దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. అటువంటి లక్ష్మీదేవిని ఎంతోమంది భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్మి ఆమెకు నిత్య పూజలు చేస్తుంటారు. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. దీప దూపాలతో నైవేద్యం సమర్పించి పూజించేవారు.

 అష్టైశ్వర్యాలను పొంది లక్ష్మీ కటాక్షాన్ని పొందాలనుకునేవారు శ్రీ మహాలక్ష్మికి చేసే పూజా విధానాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి పూజా విధానం....లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. హిందువులు ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుని ప్రతిమకు పూజ చేయాలి. అలా చేయడం వల్ల ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్నీ సవ్యంగా సాగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి ప్రతిమ ముందు దీపం వెలిగించి, ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.

లక్ష్మీ దేవికి తిలకధారణ చేసి, విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు.  అమ్మవారి ముందు రంగులతో ముగ్గు వేయాలి.
ఆ తర్వాత అమ్మవారిని పూజించడానికి ఈ మంత్రాన్ని జపించాలి...

 *ఆద్యంత రహితే దేవి మహా శక్తి ఆదిశక్తి మహేశ్వరి....
యోగజె యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే.*

ఈ మంత్రాన్ని పట్టిస్తూ లక్ష్మీదేవి పటానికి పూలతో పూజ చేయాలి.
పురాణాలు, ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. దీని వల్ల అపరమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. క్రమ పద్ధతిలో వీటిని ఉచ్ఛరిస్తే పాజిటివ్ వైబ్స్ సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ వైబ్స్ మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం. దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు. ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైంది.

మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సొంతమవుతాయి. పూజానంతరం శ్రీ మహాలక్ష్మి ముందు కూర్చుని పూజ లో వచ్చిన ఓ తామరపువ్వు తీసుకొని ఆమె పాదాల చెంత పెట్టి మన కోరికలను మొరపెట్టుకోవాలి.. ఇలా చేయడం వల్ల ఆ తల్లి చల్లని చూపు అనుగ్రహం మనపై ఉంటుందని హిందువుల నమ్మకం...

మరింత సమాచారం తెలుసుకోండి: