భారత్ కు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దిగ్గజ అథ్లెట్ గా ఎన్నో ఏళ్ల భారతదేశానికి గోల్డ్ మెడల్స్  సాధించి పెట్టాడు మిల్కాసింగ్. పేదరికాన్ని జయించి చివరికి దేశం గర్వించదగ్గ అత్యున్నత స్థాయికి ఎదిగాడు.  ఇక ఇటీవల కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ దిగ్గజ అథ్లెట్ అందరికీ దూరం అయ్యాడు. ఆయన భౌతికంగా దూరం అయినప్పటికీ ఆయన నింపిన స్ఫూర్తి మాత్రం అందరి మనసులో చెరిగిపోని  ముద్ర వేసుకుంది.  ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన పలు విషయాలు ప్రస్తుతం ప్రస్తావనకు వస్తున్నాయి.



 ఈ క్రమంలోనే మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన భాగ్ మిల్కా భాగ్ అనే సినిమా వెనుక స్టోరీ ఏంటి అన్న విషయం ఇటీవల బయటపడింది.  క్రీడలకు మిల్కా సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన బయో పిక్ ని సినిమా రూపంలో తెరకెక్కించి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు భావించారు. దీని కోసం మిల్కాసింగ్ ని సంప్రదిస్తే నిరాకరిస్తూ వచ్చాడు. ఇక భారీ ఆఫర్ ఇచ్చిన మిల్కా  అంగీకరించలేదు. కానీ చివరికి ఒక వ్యక్తి ఓకే చెప్పడం కారణంగా తన బయోపిక్ తెరకెక్కించేందుకు ఒప్పుకున్నాడట.



 భాగ్ మిల్కా భాగ్ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన కొడుకు జీవ్ మిల్కా సింగ్ కి సినిమాలు అంటే ఎంతో ఇష్టమని.. ఇక ఓసారి ఓం ప్రకాష్ మెహ్ర చిత్రం రంగ్ దే బసంతి ని చూసిన తర్వాత తన బయోపిక్ ఆ దర్శకుడు తెరకేక్కిస్తే  బాగుంటుందని జీవ్ అనుకున్నాడు అంటూ మిల్కా సింగ్ చెప్పుకొచ్చాడు.  అయితే ఇక కొడుకు అడిగిన తర్వాత కూడా బయోపిక్ తెరకెక్కించేందుకు అంగీకరించలేదట. ఇక ఎన్నో రోజుల పాటు కొడుకు బ్రతిమిలాడిన తర్వాత చివరికి ఒప్పుకున్నాడట.  ఇక భాగ్ మిల్కా భాగ్ సినిమా ప్రమోషన్ సమయంలో తన కొడుకు విధేయతకు సంతోషంగా ఉంది అంటూ మిల్కా సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ఇక మిల్కాసింగ్ మృతిపై ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: