ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టుకు అవసరమైనప్పుడు మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. యువ ఆటగాళ్లు అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా రాణిస్తున్నారు. టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ తామే అని నిరూపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇక ఇలా  యువ ఆటగాళ్లపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.


 ఇలా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన తో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో అటు కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్ లో ఎక్కువగా అవకాశాలు దక్కించుకున్న ఈ ఆటగాడు వచ్చిన అవకాశాలను మాత్రం బాగా సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి. మరిముఖ్యంగా ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. కోల్కతా పరాజయం ఖాయమని అనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ 15 బంతుల్లోనే 40 పరుగులు చేసి కోల్కతా జట్టుకు విజయం అందించినంత పని చేశాడు.


 కాని చివరిలో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి చివరికి వికెట్ కోల్పోయాడు. దీంతో అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ ఆటగాళ్లు. ఇటీవలే కోల్కతా జట్టు కోచ్ మేకల్లమ్ స్పందిస్తూ అతని ప్రతిభ ను కొనియాడాడు. జట్టుకు అవసరమైనప్పుడు తానున్నానంటూ భరోసా ఇచ్చే గొప్ప ఆటగాడు రింకు సింగ్. అతనిపై యాజమాన్యానికి నమ్మకం ఉందని తెలిపాడు. ఇకపై అతడు జట్టులో కీలక సభ్యుడు గా కొనసాగే అవకాశం ఉందని తెలిపిన మేకల్లమ్ చాలా కాలం పాటు బెంచ్ పరిమితమైనప్పటికీ వచ్చిన అవకాశాన్ని మాత్రం బాగా వినియోగించుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl