చివరిసారిగా 2011లో ప్రపంచకప్ గెలిచింది టీమిండియా. ఏకంగా పుష్కరకాలంగా టీమ్ ఇండియాకు ప్రపంచ కప్ అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. అయితే 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా రెండుసార్లు ఈ ప్రపంచ కప్ టోర్నీ ఆడింది. అయితే ఈ రెండు సార్లు కూడా సెమీఫైనల్ వరకు దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఇక అక్కడ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక ఇంటిదారి పట్టింది. అయితే ఈ ఏడాది మాత్రం వన్డే ప్రపంచ కప్ ను ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలని పట్టుదలతో కనిపిస్తుంది టీమిండియా.


 ఇక ఈ మెగా టోర్ని భారత్ లోనే జరుగుతూ ఉండడంతో టీమ్ ఇండియాకు మిగతా జట్లతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే అడ్వాంటేజ్ ఉండనుంది అని చెప్పాలి. అందుకే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికాలకంటే పటిష్టంగా కనిపిస్తుంది. కానీ ఒక్క పొరుగు జట్టు మాత్రం టీమిండియాను భయపెడుతుంది. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లలో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తుంది. 2022 బంగ్లాదేశ్లో పర్యటించిన భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయి చెత్త రికార్డు మూటగట్టుకుంది.



 ఇటీవలే ముగిసిన 2023 ఆసియా కప్ లో కూడా అన్ని జడ్లపై విజయం సాధించిన టీమిండియా.. బంగ్లాదేశ్ చేతిలో మాత్రం ఓడిపోయింది. ఇక గతంలో 2022 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ పై అతి కష్టం మీద విజయం సాధించింది. 2017 లో వన్డే ప్రపంచ కప్ లోను బంగ్లాదేశ్ పై భారత్ విజయం అంత సులభంగా దక్కలేదు. ఇక 2007 వన్డే ప్రపంచ కప్ ను అయితే భారత అభిమానులు అస్సలు మర్చిపోరు. ఆ సమయంలో గ్రూప్ స్టేజ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్.. ఇక లీగ్ దశ నుంచి ఇంటిదారి పట్టింది. ఇలా పటిష్టమైన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కంటే బంగ్లాదేశ్ నుంచి టీమ్ ఇండియాకు ఎక్కువ ముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: