
ఇకపోతే, బెంగళూరు ఫ్యాన్ గా పేరున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తన ఆనందాన్ని మరచిపోలేని విధంగా వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రశాంత్ నీల్ డ్యాన్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది అభిమానులు ఆ వీడియోపై స్పందిస్తూ ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు.
కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా భారీ గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాను "ఎన్టీఆర్ – నీల్" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, T సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు కలిసి నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశముంది. ఆర్సీబీ విజయం, ప్రశాంత్ నీల్ సెలబ్రేషన్, ఎన్టీఆర్ – నీల్ కాంబినేషన్ మూవీ తాజా అప్‌డేట్‌తో అభిమానులు రెండింతల ఉత్సాహంలో ఉన్నారు.