
ఈ ప్రయోగం విఫలం అయినట్టు ఇస్రో కూడా అధికారికంగా ధృవీకరించింది. తాము అనుకున్న కక్ష్యలో శాటిలైట్లను ప్రవేశ పెట్టలేకపోయామని, మరో కక్ష్యలో వాటిని ప్రవేశ పెట్టడం వల్ల గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీంతో ఈ ప్రయోగం ద్వారా చిన్న శాటిలైట్లను చిన్న రాకెట్ ద్వారా నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశ పెట్టి రికార్డ్ సృష్టించాలనుకున్న ఇస్రోకు చేదు అనుభవం ఎదురైనట్టయింది. ఈ వైఫల్యానికి కారణాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.
విద్యార్థుల శ్రమకు దక్కని ఫలితం..
భూ పరిశీలనకు ఉపయోగించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని స్పేస్ కిడ్జ్ ఇండియా విద్యార్థులు రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతరిక్షంపై మరింత అవగాహన పెంచేందుకు ఈ శాలిలైట్ ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఇక దీనితోపాటు అంతరిక్షంలోకి వెళ్లిన మరో శాటిలైట్ పేరు ఆజాదీ శాట్. దీన్ని భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 750 మంది పాఠశాల విద్యార్థులు రూపొందించారు. అయితే తొలిసారిగా జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ కాకుండా ఎస్ఎస్ఎల్వీ ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టేందుకు ఇస్రో ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం ఇలా వికటించింది.