
ఈ విషయం పైన యాంకర్ విష్ణుప్రియ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యింది. అలా మార్చి 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లిన విష్ణు ప్రియ ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించబోతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ చివరికి తన లాయర్ సపోర్ట్ వల్ల బయటపడింది. విష్ణు ప్రియ 15 బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేశానని ఒప్పుకున్నది. ఈ కేసులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్త పడింది విష్ణు ప్రియ. అయితే ఎంత జాగ్రత్త అన్న చివరికి తప్పించుకోలేకపోయింది.
బెట్టింగ్ యాప్స్ అరెస్టు విషయంపై విష్ణు ప్రియ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీడియా వాళ్లు రాసేటువంటి రాతలు థంబ్ నెయిల్స్ వల్ల తనకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని అందుకే వారికి కనిపించకుండా చండాలంగా వచ్చిన కూడా కనిపెట్టారని.. స్టేషన్ కి వెళ్లిన సమయంలో ఊరికే మింద పడిపోయి చాలా హడావిడి చేశారు.. మొఖంపై మైకు పెట్టి తాను పెద్ద క్రైమ్ చేశాను అన్నట్టుగా ఒక సీన్లను క్రియేట్ చేశారు.. కానీ తాను చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తెలియకుండా చేశానని.. ముఖ్యంగా తాను ఇంటర్ వరకే చదివాను అందుకే పెద్దగా తెలియదు ఒకవేళ అది తప్పని తెలిసి ఉంటే చేసే దాన్ని కాదంటూ తెలిపింది విష్ణు ప్రియ.
పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత తనని భయపెట్టి రిమాండ్ కు పంపించాలని చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచక దాంతో తనకి భయం వేసిందని చివరికి ఆ దేవుడి దయవల్ల లాయర్ల వల్ల బయటికి వచ్చాను అంటూ తెలిపింది విష్ణు ప్రియ. అప్పటినుంచి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లలేదని తెలిపింది.