ఇటీవలి కాలం లో అడవులు అంతరించి పోతున్నాయి. స్వార్థం కోసం అడవులను నరకటం చేస్తూ పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు మనుషులు. దీంతో కొన్ని సంవత్సరాల ముందువరకు అడవుల్లో ఎంతో ఆనందం గా జీవించిన జంతువులు ఇక ఇప్పుడు మాత్రం జనావాసాల్లోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా నేటి రోజుల్లో జనావాసాల్లోకి వస్తున్న వన్య ప్రాణుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతూనే ఉంది. అయితే కొన్ని జంతువుల కారణం గా మనుషులు ప్రమాదం  లో పడిపోతూ ఉంటే. ఇంకొన్ని జంతువు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు వెలుగు లోకి వస్తున్నాయి.


 ఈ క్రమం  లోనే ఇటీవల కాలం  లో ఎన్నో జంతువులకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారి పోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.. సాధారణం గా మనం పురాతన గ్రంథాలలో వింటూ ఉంటాం.. జంతువులు నీటిపై కూడా నడుస్తూ ఉండేది అని.  కానీ ఇటీవలి కాలంలో ఇలాంటివి అసాధ్యమనే చెప్పాలి.  కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక గుర్రం నీటిపై వేగంగా పరిగెత్తుతున్న వీడియో ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది.


 ఇది గ్రాఫిక్స్ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే పడవలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి నీటిపై పరిగెడుతున్న గుర్రాన్ని వీడియో తీసి ఇక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.  దీంతో ఈ వీడియో కాస్త నెటిజన్లు అందర్నీ కూడా అవాక్కయ్యేలా చేస్తోంది అని చెప్పాలి. ఇక మొదట ఈ వీడియో చూసినప్పుడు కేవలం గట్టు వైపు మాత్రమే గుర్రం పరిగెడుతుంది అనుకుంటారు. కానీ ఆ తర్వాత మాత్రం  మొత్తం ఆ నీటి కాలువలను దాటేస్తుంది గుర్రం. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ కళ్లను తాము నమ్మలేకపోతున్నాము అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: