ప్రపంచంలో ఏ మూలన ఏ వింత జరిగిన సోషల్ మీడియా ద్వారా చిటికలో ఇట్టే తెలిసి పోతాయి. అందులో భయంకరమైనవి , జంతువుల ఫన్నీ వీడియోలు, ఫ్రాంక్ వీడియోలు. వైవిధ్య భరితమైనవి. విజ్ఞాన్ని అందించేవి ఇలా ఎన్నో వైరల్ వీడియోస్ ఉన్నాయ్. తాజాగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఏమిటంటే దోమ గుడ్లను ఒక క్రమ పద్దతిలో పేర్చి నీటిలో వదిలివేయడం వింత గా అనిపించింది.

  


దోమలను నివారించడానికి ఎన్నో పద్ధతులు ఆచరణలో ఉన్నా దోమలను నివారించడం లో ప్రజలు చాల కష్టపడుతున్నారు. అకాల వర్షాల వల్ల కుంటలు , గుంతలు , ఇంటి లోని వ్యర్థ పదార్థాలు వంటి వాటి లో నీరు నిల్వలు కారణంగా దోమలు పెరుగుతున్నాయి. దోమలు చేసే వింత శబ్దాలకు కోపం చిరాకు వేస్తుంది. దోమలు మనిషిని రక్తం కోసం పీల్చి పిప్పి చేస్తున్నాయా అని అనిపిస్తుంది. దోమ కాటుకు బలై ప్రాణాంతక మైన జ్వరాలను , వ్యాధులను తెచ్చుకున్న వారు లేకపోలేదు. కరోనా వైరస్ కంటే దోమలే చాల డేంజర్ అనేట్లు ఉంది తాజా గా పెరుగుతున్న డెంగ్యూ కేసుల సంఖ్య చూస్తే.





ఇక దోమ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీ కోసం. ఈ వీడియో లో గమనించినట్లయితే దోమ తన గుడ్లను ఒక వరుస కామం లో పేర్చి నీటిలో వదులుతుంది. ఎందుకంటె దోమల లార్వాలు సరైన క్రమంలో బయటకు రావడానికి. దోమ గుడ్లను పేర్చే విధానం చూస్తే ఆశ్చర్యం వెయ్యకమానదు. ఒక ఆడ దోమ తన జీవిత కాలం లో ఒక సారి మాత్రమే మగ దోమతో సంపర్కం చేస్తుంది. కలసిన ఆ ఒక్కసారి మాత్రమే 200 నుండి 500 వరకు గుడ్లను పెడుతుంది. ఆడ దోమ జీవిత కాలం 40 రోజుల నుండి 50 రోజుల వరకు ఉంటుంది. కానీ మగ దోమ జీవిత కాలం 10 రోజులు మాత్రమే .








మరింత సమాచారం తెలుసుకోండి: