గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిన్న జరిగిన విమాన  ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే . అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే ..లండన్ కి బయలుదేరిన విమానం కుప్పకూలిపోయింది . ఈ ప్రమాదంలో 241 మంది అక్కడికక్కడే మరణించారు,  ఒక వ్యక్తి మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు . ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏఐ171 విమానం దాదాపు 265 మందిని బలి తీసుకుంది.

ఇందులో 241 మంది ప్రయాణికులు కాగా ఫ్లైట్ సిబ్బంది పైలెట్ తో పాటు ఈ విమానం పడిన కాలేజ్ లకు చెందిన 24 మంది విద్యార్థులు మొత్తం కలిపి 265 మంది చనిపోయారు . దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విమానయాన విషాదలలో ఇది ఒకటిగా నడిచింది . కాగా ఈ విమాన ప్రమాదం లో మరణించిన మృతులకు ఆల్రెడీ టాటా గ్రూప్ ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది . ఇదే మూమెంట్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది..?? అనే విషయం కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

దేశ విమానయాన చరిత్రలోనే  అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ గా ఇది నిలవబోతోంది అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సుమారు 2400 కోట్లు ఈ బీమా క్లైమ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది . బోయింగ్ డ్రీమ్ లైనర్ క్రాష్ కారణంగా అగ్నిగోళంగా మారి వందల ప్రాణాలు తీసినందున హల్ లేబులిటీ విభాగాల కింద ఫైల్ చేసుకునే అవకాశం ఉంది అంటూ హౌ డెన్ ఇండియా సీఈవో  ఎండి అమిత్ అగర్వాల్ తెలిపారు.  అంతేకాదు ఈ విమానం ప్రస్తుత విలువ.. వయసు.. కాన్ఫిగరేషన్ మిగతా అంశాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది అంటూ పేర్కొన్నారు .

ఈ లెక్కన చూసుకుంటే దీనికి ఇన్సూరెన్స్  211 మిలియన్ల డాలర్ల నుంచి 289 వరకు ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు . కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 2013 నాటిదిగా తెలుస్తుంది . అంతేకాదు 2021లో దీనిని 211 మిలియన్ల డాలర్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది .  అదే కనుక నిజమైతే నష్టం చిన్నదైనా పెద్దదైన ఎయిర్లైన్స్ సంస్థ నిర్ధారించిన విలువ ఆధారంగానే చెల్లించాలి. మృతులకు మాత్రం 1999 నాటి మాంట్రియల్ ఒప్పందం ఆధారంగానే పరిహారం నిర్ణయిస్తారు .

ఒకవేళ ఇదే లెక్కన చూసుకుంటే మాత్రం ఒక్కో ప్రయాణికుడికి కోటి 40 లక్షల 47 కోట్లు పరిహారం అందుతుంది.  అదే కాకుండా టాటా గ్రూప్ ఇప్పటికే ప్రయాణికులు అందరికీ కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది . దీనికి ఇన్సూరెన్స్ పరిహారం అదనం.  ఒకవేళ ఎయిర్ లైన్స్ నిజంగా ఈ ప్రకారం బీమా క్లైమ్ చేసుకుంటే మాత్రం సుమారు 2400 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ వస్తుంది అంటూ పలుగురు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు . అదే జరిగితే దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బీమా క్లైమ్ ఇదే అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: