
ప్రస్తుతం ప్లాట్ ఫాఎం పై ఏ వీడియోలు పాపులర్ గా ఉన్నాయి ..ఏ విషయం హైలెట్ గా ఉంది అని తెలుసుకోవడానికి ఈ ట్యాబ్బాగా ఉపయోగపడుతుంది. కానీ త్వరలో ఈ "ట్రెండింగ్ ట్యాబ్" కనిపించదు . ఇదే విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది యూట్యూబ్ . కొన్ని వారాలలో ఈ ట్యాబ్ ను పూర్తిగా తొలగించబోతున్నామని స్పష్టంగా తెలియజేసింది. అయితే ఎందుకు ఈ ట్యాబ్ ని తొలగిస్తున్నారు అనేది మాత్రం చెప్పలేదు . ఇటీవల కాలంలో యూజర్లు పర్సనల్ కంటెంట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .
అంటే వారి వారి అభిరుచులకు తగ్గట్టు ఏ రకాల వీడియోస్ చూడాలి ఏ జోనర్ లో ఉండే వీడియోస్ చూడాలి అన్నదానిపై ఖచ్చితంగా వాళ్ళే చూస్ చేసి సెర్చ్ చేసుకుంటున్నారు. అందుకే ట్రెండింగ్ ట్యాబ్ కి వచ్చే ట్రాఫిక్ గత కొంతకాలంగా భారీగా తగ్గుతూ వస్తుందట . ట్రెండింగ్ ట్యాబ్ ద్వారా సాధారణంగా వైరల్ వీడియోలు ..మ్యూజిక్ ట్రాక్స్.. న్యూస్ హైలెట్స్ వంటివి చూసే వారు. కానీ ఇప్పుడు వాటిని యూజర్ హోమ్ పేజీ లేదా సబ్స్క్రిప్షన్ ఫీడ్ లోనే అందుబాటులోకి ఉంచుతుంది యూట్యూబ్. అందుకే ప్రత్యేకంగా ఒక ట్రెండింగ్ ట్యాబ్ అనేది అవసరం లేదు అని అభిప్రాయంతో ఈ ట్యాబ్ ను తొలగించే దిశగా నిర్ణయం తీసుకుందట. ట్రెండింగ్ అనే సెక్షన్ సపరేట్గా అవసరం లేదు అంటూ యూట్యూబ్ భావిస్తుంది . తద్వారా నావిగేషన్ మరింత సులభతరం చేయాలనుకుంటుంది . 2015లో మొదటిగా ట్రెండింగ్ సెక్షన్ ను పరిచయం చేసింది యూట్యూబ్ . గత ఐదేళ్లలో ఈ సెక్షన్ కి రావాల్సిన ట్రాఫిక్ చాలా చాలా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..!!