బండి కొనాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద బండి కొనాలని భావిస్తారు. అయితే ఎటువంటి వాటిని కొనాలని ఆలోచనలో పడతారు. కానీ ఇప్పుడు అందరూ విద్యుత్ వాహనాల పై మొగ్గు చూపు తున్నారు.. ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఎన్నో ప్రముఖ కంపెనీలు కరెంట్ తో పనిచేసే మోటార్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మేరకు ప్రతి ఒక్కరూ ఎలెక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి మేలు మాత్రమే కాదు.. సౌండ్ పొల్యూషన్ , ఇంధన వినియోగాన్ని తగ్గిస్థాయి.. గోవా కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కబీరా మొబిలిటీ..


తాజాగా KM3000, KM4000 రెండు కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.. డెలివరీ లు మాత్రం మే నెల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది..ఎకో, బూస్ట్ అనే రెండు మోడ్స్ లో ఛార్జింగ్ చేయవచ్చు. ఎకో మోడ్ లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. బూస్ట్ మోడ్ లో 80 శాతం బ్యాటరీ ని కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ రెండు బైక్స్ లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఆన్ బోర్డ్, రోడ్ సైడ్ అసిస్టెంట్, పార్క్ అసిస్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇకపోతే ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ స్పీడ్ తో 150 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు..


రెండు ఎలక్ట్రిక్ బైక్ లను ముందుగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై, గోవా, ధార్వాడ్ వంటి9 నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. KM3000 బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1,26,990 ఈ బైక్ గరిష్టంగా 6000W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. KM4000 బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1,36,990 , ఈ బైక్ గరిష్టంగా 8000W శక్తిని ఉత్పత్తి చేస్తుంది.. ఇప్పుడు సేల్స్ భారీగా పెరగడం తో ఇప్పుడు మరో కొత్త ఫీచర్స్ ఉన్న బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఆ బైక్ ఫీచర్స్ ను ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: