రాష్ట్ర వినియోగదారుల హక్కుల చట్టంలో ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. వినియోగదారుల సహాయం కోసం 1967 తో పాటు 18004250082 టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు.  వినియోగదారులకు ఇబ్బంది కలిగి, కల్తీ వస్తువులు ఇతర ఇబ్బందులు వస్తే లీగల్ గా పరిష్కారం కోసం మార్పులు తెస్తున్నట్లు మంత్రి కారుమురు నాగేశ్వరరావు వెల్లడించారు.

వినియోగదారులు ఎక్కడ ఏ ప్రాంతంలో వస్తువు కొనుగోలు  చేసినా కూడా ఇబ్బంది కలిగితే తమ సొంత ప్రాంతాల్లో ఉండి కేస్  లు వెయ్యవచ్చని మంత్రి కారుమురు నాగేశ్వరరావు అన్నారు. గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు చెయ్యవచ్చని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు.  అదే విధంగా ఆన్లైన్ లో కోర్ట్  హియరింగ్ జరుగుతుందని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. డిసెంబర్  24న వినియోగదారుల దినోత్సవం రోజున ఒక సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. వ్యాపారులు కల్తీ లేకుండా వస్తువులు అమ్మకాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కారుమురు నాగేశ్వరరావు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: