బెజవాడలో దివ్యను హత్య చేసిన కేసు సంచలనంగా మారింది. ఈ హత్య కేసుపై ఇప్పుడు పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ఈ కేసులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిద్దరూ ముందే పెళ్లి చేసుకున్నారు అని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దివ్య మృతదేహానికి పోస్డుమార్టం పూర్తి చేసారు.

దివ్య మృతదేహం ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించారు అధికారులు. దివ్య గొంతుపై బలమైన కత్తి గాటు కారణంగా తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు పోస్టు మార్టంలో వైద్యులు వెల్లడించారు. దివ్య గొంతుపై సుమారు రెండు అంగుళాల‌ మేర కత్తితో నరికినట్లు వెల్లడించారు. సగం పైగా గొంతు తెగినట్లు పోస్టు మార్టంలో వెల్లడి అయింది. దివ్య మృతదేహంపై మొత్తం పలు చోట్ల 13 కత్తి గాట్లు... మణికట్టు పైనా... పొట్టపైనా కత్తి గాయాలు అయ్యాయి అని అధికారులు  పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: