వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని కొందరు కోరుకుంటారు. ఇందు కోసం ఎంతైనా వెచ్చిస్తుంటారు. ఈ ఫ్యాన్సీ నంబర్ల వ్యవహారం రవాణాశాఖకు కాసుల వర్షం కురుస్తుంది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ జోన్ లోని బండ్లగూడలో TG 12 0999 ఫ్యాన్సీ నంబర్ కు రూ.1,30,009 ధర పలికింది. అలాగే TG 12 0786 ఫ్యాన్సీ నంబర్ కు రూ. 74,786 ధర పలికింది. ఇక ఆర్టీఏ వెస్ట్ జోన్ లోని ఇక టౌలీచౌక్ రవాణాశాఖ కార్యాలయంలో TG 13 0001 నంబర్ కు రూ.1,61,111 ధర పలికింది. అలాగే మరో నంబర్‌ TG 13 1000 నంబర్ కు రూ.60,000ల ధర పలికింది.

ఈ రెండు నంబర్లకు రిజర్వేషన్ ఫీజు, బిడ్ ధర కలుపుకుంటే రవాణాశాఖకు రూ.5,38,511 ఆదాయం సమకూరింది. సౌత్ జోన్ రవాణాశాఖ కార్యాలయంలో TG120007 నంబర్ కు రూ.44, 500లు, TG120786 నంబర్ కు రూ. 74,786లు, TG120999 నంబర్ కు రూ.1,30,009లు ఈ మూడు ఫ్యాన్సీ నంబర్లకు కలిపి రూ. 3,33,295ల ఆదాయం సమకూరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: