ఎన్నికల షెడ్యూలు ప్రకటన తర్వాత మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ వచ్చిన తరవాత ప్రభుత్వ భవనాల పై ఉన్న రాజకీయ నేతల ఫోటోలు, ప్రకటనలు తొలగిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయితే ఎన్నికల అక్రమాలపై ప్రజలు నేరుగా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 100నిముషాల్లో చర్యలు తీసుకుంటారు.

అధికారులకు ఫిర్యాదు చేస్తే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ సీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫోటో వీడియో తీసి పంపించ వచ్చు. వాల్ రైటింగ్, పోస్టర్ లు, బ్యానర్లు  1.99 లక్షల తొలగించారు. ఇప్పటికే కోడ్ ఉల్లంఘనపై వందల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన మూడు రోజుల్లో మే 3.39 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. 1.69 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: