తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో పలు చోట్ల ఫిరాయింపులు, అవిశ్వాసాలకు స్థానిక సంస్థల పీఠాలను గెలుచుకుంటోంది. గుంటూరు, విశాఖ కార్పొరేష‌న్ల‌కు మేయ‌ర్లు కూడా కూట‌మి నుంచే వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న కుప్పం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో మ‌రో కౌన్సెల‌ర్ ను టీడీపీ త‌ర‌పున చైర్మ‌న్ గా నియ‌మించారు. అలాగే బొబ్బిలి, చీరాల మున్సిపాల్టీల్లోనూ ఫిరాయింపుల మ్యాజిక్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ఫిరాయింపుల వ‌ల్ల టీడీపీ తో పాటు కూట‌మి లోని ఇత‌ర పార్టీల‌కు ఎంత మాత్రం లాభం ఉండ‌దు .. పైగా ఈ జంపింగుల వ‌ల్ల చాలా చోట్ల ఎమ్మెల్యేలు .. త‌మ స్వ‌లాబం కోసం పార్టీ మారి వ‌చ్చిన వారికే వ‌చ్చే యేడాది స్థానిక ఎన్నిక‌ల్లో సీట్లు ఇస్తే అంతిమంగా గ‌త ఐదేళ్ల లో పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన నాయ‌కులకు ఇబ్బందులు త‌ప్ప‌వు.


ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారి ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసి రేపు స్థానిక ఎన్నిక‌ల్లోనూ వారికే సీట్లు .. టిక్కెట్లు .. ప‌ద‌వులు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో లోక‌ల్ కేడ‌ర్ ఐదేళ్ల పాటు ఏ వైసీపీ నాయ‌కుల‌తో పోరాటాలు చేశారో .. రేపు మ‌ళ్లీ వారి కిందే ప‌ని చేయాల్సిన దుస్థితి ఎదుర్కోక త‌ప్ప‌దు. వైసీపీ హయాంలో మున్సిపల్ ఎన్నికలు అత్యంత ఘోరంగా జరిగాయి. వాటిని ఎన్నికలు అనడం కన్నా రిగ్గింగ్ అనడం బెటర్. టీడీపీకి దర్శి, తాడిపత్రి మున్సిపాల్టీల్లో తప్ప ఎక్కడా విజయం దక్కలేదు. ఇప్పుడు మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వులు టీడీపీ చేతిలో లేక‌పోయినా .. ప్ర‌భుత్వం లేక‌పోతే ఎవ్వ‌రూ ఏం చేయ‌లేరు. కానీ టీడీపీ ఈ క‌క్కుర్తి ప‌నుల‌కు పోతే అంతిమంగా పార్టీ కేడ‌ర్ ఇబ్బందుల పాల‌య్యి .. పార్టీకే న‌ష్టం జ‌రుగుతుంది.


పిరాయింపుల వల్ల పార్టీ కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నేతలకు వ‌చ్చే లోక‌ల్ ఎన్నిక‌ల్లో టిక్కెట్లు దొరకడం గగనంగా మారుతుంది. అందుకే మున్సిపల్ ఫిరాయింపులను కూటమి పార్టీలు ప్రోత్సహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం ఇప్పుడు గ‌ట్టిగా వినిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: