- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత ఇలా కడపలో ప్రతిష్టాత్మకంగా మహానాడు ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా కొరకరాని కొయ్య మాదిరిగా మిగిలింది. ప్రతి ఎన్నికల్లోను కేవలం ఒక సీటుతో మాత్రమే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటిది గత ఏడాది జరిగిన ఎన్నికలలో అందరి అంచ‌నాలు తలకిందులు చేస్తూ కూటమి ఏకంగా ఏడు స్థానాలలో విజయం సాధించింది. కడప ఎంపీ సీటులో కూడా వైసిపి చావుతప్పి కన్నులుట్టబోయిన చందంగా విజయం సాధించింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కడప జిల్లాలో ఉన్న పది సీట్లను .. రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంటామని చంద్రబాబు మహానాడు వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. అయితే వాస్తవంగా చూస్తే ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో కడప జిల్లాలో కూటమి గ్రాఫ్ తగ్గిందని నివేదికలు మరియు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.


జగన్ ఐదేళ్ల పాలనలో విసిగిపోయి ఉన్న ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఓటమికి ఎవరు ఊహించిన రీతిలో పట్టం కట్టారు. అందుకే గత రెండున్నర దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా ఏడు స్థానాలలో విజయం సాధించింది. అయితే ఆ పట్టును నిలుపుకోవటంలో కూటమి ప్రజాప్రతినిధులు విఫలమవుతూ వస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు అనుకున్న రీతిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు , సంక్షేమం ఉమ్మడి కడప జిల్లాలో చేయడం లేదని జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారట. మరి చంద్రబాబు లెక్కలు పదికి పది స్థానాలలో విజయం సాధిస్తాం అన్నట్టుగా ఉన్నాయి. ఇక్క‌డ గ్రాఫ్ త‌గ్గుతోంద‌నే మ‌హానాడు పెట్టార‌ని కూడా టాక్ ? మరి ఈ నాలుగేళ్లలో కడప జిల్లా ప్రజల ప్రేమను చంద్రబాబు ఎలా ? గెలుచుకుంటారు 2029లో ఆయన టార్గెట్ పెట్టుకున్నట్టు పది సీట్లు గెలుస్తారా ? అన్నది చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: