మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలి అని వైద్యులు చెబుతున్నారు విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ తర్వాత గుడ్డు పెంకులను పడేస్తూ ఉంటారు. అయితే ఈ గుడ్డు పెంకులు మొక్కలకు మంచి పోషకాహారం అని కొంతమందికి తెలిసిన విషయమే.. ఈ గుడ్డు పెంకులతో కేవలం మొక్కలకే కాదు మనిషి శరీరానికి కూడా ఉపయోగకరమే అని ఎవరికి తెలుసు..? బహుశా ఎవరు తెలియదనే చెప్తారేమో..? ఎందుకంటే కొంత మందికి గుడ్డు తిని గుడ్డు పెంకులు పడేయడమే తెలుసు కాబట్టి.. ఇకపోతే గుడ్డు పెంకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.

గుడ్డులోని తెల్లటి భాగంతో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల గుడ్ల పెంకుల పొడిని కలిపి బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖం మీద అప్లై చేసి 15నిముషాలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది.

ఒక్కొక్కసారి మనం ఉపయోగించే కిచెన్ వాష్ బేసిన్ ఎంత శుభ్రం చేసినప్పటికీ , మరకలతో జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యతో విసిగి పోతూ ఉన్నట్లయితే గుడ్డు పెంకులను బాగా క్రష్ చేసి కిచెన్ చుట్టూ వేయండి..  మరకలు పూర్తిగా తొలగిపోయి బేసిన్ కూడా శుభ్రంగా ఉంటుంది.

అంతేకాదు కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులతో బాధపడుతున్న వారు ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని.. అందులో ఈ గుడ్డు పెంకులు వేసి బాగా కలపాలి.. ఒక రోజంతా వదిలేసి రెండవ రోజు ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మీరు నొప్పులతో బాధ పడుతున్నారో.. ఆ ప్రదేశంలో అప్లై చేయడం వల్ల త్వరగా నొప్పులు అన్ని మాయం అవుతాయి.

గార్డెన్ లో పెంచుకొనే మొక్కలకు ఈ గుడ్డు పెంకులు వేయడం వల్ల క్యాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉండడంతో పాటు ఎటువంటి కీటకాలు కూడా మొక్కలకు దరిచేరవు. అంతేకాదు వానపాముల సంతానోత్పత్తిని పెంచడానికి కూడా ఈ గుడ్డు పెంకులు పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: